పెన్షన్ దరఖాస్తులపై విచారణ.. ఎంపీడీవో చెక్!

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట పంచాయతీ గుబ్బడిలో కొత్త పెన్షన్ల దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఎంపీడీవో బి. జయరాం విచారణ చేశారు. దరఖాస్తుల్లో ఇచ్చిన వివరాలను నిజమో కాదో చెక్ చేశారు. సర్పంచ్ కొయ్యడ సృజన కుమార్, పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


