'చెక్ పవర్' రద్దుపై సర్పంచ్ ప్రొటెస్ట్

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కల్లూరు గ్రామంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. తన ఆర్థిక అధికారాలైన 'చెక్ పవర్' క్యాన్సిల్ చేయడం వెనుక లోకల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హ్యాండ్ ఉందంటూ కల్లూరు సర్పంచ్ పెంట దశరథ్ పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. విలేజ్ డెవలప్మెంట్ను ఆపడానికే పొలిటికల్ జోక్యం చేసుకుంటున్నారని, ఆఫీసర్లతో కలసి తన చెక్ పవర్ని రద్దు చేయించారని మండిపడ్డారు. తక్షణమే చెక్ పవర్ను రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు.




