← Back to news

చిరుత సంచారం.. గ్రామస్తుల్లో భయం

By DK· 10h ago
చిరుత సంచారం.. గ్రామస్తుల్లో భయం

కర్నూలు జిల్లా అస్పరి మండలం బిల్లేకల్లు గ్రామంలోని ఊరుకొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

More in Local