← Back to news

మాకు న్యాయం చేయండి- ఔట్ సోర్సింగ్ టీచర్ల నిరసన

By DS· 22 Jun 2026· vijayawada
మాకు న్యాయం చేయండి- ఔట్ సోర్సింగ్ టీచర్ల నిరసన

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పది, పదిహేనేళ్లుగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మెగా డీఎస్సీ కారణంగా తమ ఉపాధి కోల్పోయామని, గురుకుల బైలాస్‌కు విరుద్ధంగా తమ పోస్టులను డీఎస్సీలో విలీనం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియామకాలకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, లేకపోతే కాంట్రాక్టు విధానంలోకి తీసుకోవాలని లేదా రెగ్యులర్ చేసి మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

More in News