దుర్గా యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని దుర్గా యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మహా అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.


