పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి

పెద్దపల్లి మండలం ములసాలలో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురుస్తుండగా గొర్రెల మందపై పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌కు చెందిన 25 గొర్రెలు మృతి చెందాయి. ఒక్కసారిగా జరిగిన ఘటనతో గొర్రెల యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జీవనాధారమైన గొర్రెలు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో భారీగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.


