← Back to news

పాలిటెక్నిక్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

By Adithya D· 22 Aug 2026· షాద్‌నగర్
పాలిటెక్నిక్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

TG : పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్డ్ యూనివర్సిటీలో కలపొద్దంటూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు షాద్‌నగర్ RDO ఆఫీస్ ముందు నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ఆందోళన వల్ల పాత నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆగిపోయింది. తర్వాత RDO సరిత బయటకు వచ్చి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన ముగించారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు ఆకాశ్ నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

More in Local