బంకించంద్ర చటర్జీని స్మరించుకోవాలి: MLA
వందేమాతరం గేయం ప్రతి ఒక్కరి గొంతులో మార్మోగాలని నిర్మల్ జిల్లా ముధోల్ MLA పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యాభారతి ఆధ్వర్యంలో ‘నమామి భారతం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సామూహిక వందేమాతరం గాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర చటర్జీని స్మరించుకోవాలని తెలిపారు. దేశభక్తి భావనను పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు.



