← Back to news

తాళం పగులగొట్టి బంగారు ఆభరణాల చోరీ

By Kamal Kumar· 6h ago· Vikarabad
తాళం పగులగొట్టి బంగారు ఆభరణాల చోరీ

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బద్లాపూర్ గ్రామంలో ఇంటి తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. గ్రామానికి చెందిన కవిత ఈ నెల 15న పొలం వద్దకు వెళ్లగా, దొంగలు ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి రెండు తులాల బంగారు గుండ్లు, కమ్ములు, ముక్కుపుడకతో పాటు నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐ విరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local