ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు పరిశీలిస్తాం

TG: హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించేందుకు తీసుకొచ్చిన కామన్ పాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి. దీంతో ధరలను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక రోజు పాస్ ధర ₹400, నెల పాస్ ధర ₹8,500గా ఉంది. ఇందులో రోజువారీ పాస్కు మెట్రో వాటా ₹300, ఆర్టీసీ వాటా ₹100. నెల పాస్లో మెట్రో వాటా ₹7,000, ఆర్టీసీ వాటా ₹1,500. ధరలపై త్వరలో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.



