← Back to news

కరకవాగు వద్ద తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!

By SKR· 1h ago· Bhadradri Kothagudem
కరకవాగు వద్ద తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!

కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకవాగు వద్ద విషాదం చోటుచేసుకుంది. కిన్నెరసాని నుంచి వచ్చే కేటీపీఎస్ కాలువలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ వద్ద గతంలోనూ ప్రమాదాలు జరిగాయని, ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరకవాగు వద్ద తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!

More in Local