దేశమంతా జంతర్మంతర్గా మారుతుంది: ప్రకాష్ రాజ్
జంతర్మంతర్పై ఆంక్షలు, CJP సభ్యుల అరెస్టుపై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. జాతీయ జెండాతో నిరసనకు వెళ్లిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వేదికలను మార్చగలరేమో కానీ ప్రజల గొంతును అణచలేరని Xలో రిలీజ్ చేసిన వీడియోలో స్పష్టం చేశారు. కేంద్రం చర్యలతో దేశమంతా జంతర్మంతర్గా మారుతుందని అన్నారు. డెమోక్రటిక్ రైట్స్ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

