ప్రసాదం వేస్ట్‌తో కరెంట్.. ముంబయిలో కొత్త ప్లాన్!

ముంబయిలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలకు లాల్‌బాగ్‌చా రాజా మండపంలో భక్తులకు ఇచ్చే ప్రసాదం, ఆహారం నుంచి వచ్చే వెట్ వేస్ట్‌తో కరెంట్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ‘ప్రసాద్ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా BMC, 11 రోజుల్లో అల్మోస్ట్ 80 మెట్రిక్ టన్నుల వేస్ట్‌ను బయోమెథనేషన్ ప్లాంట్లకు షిఫ్ట్ చేయనుంది. తద్వారా 7వేల యూనిట్లకు పైగా కరెంట్ ప్రొడక్షన్ చేసి నాయర్, కస్తూర్బా, GTB, సియాన్ ప్రభుత్వ హాస్పిటల్స్‌కు ఇవ్వనుంది... మీ ఊరి మట్టి గణపతితో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.



