బహుజన సమర భేరి

మహబూబ్‌నగర్ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో BSP నాయకులు సభ కరపత్రాలను విడుదల చేశారు. BSP పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో ‘బహుజన రాజ్యాధికార సమర భేరి’ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని BSP సీనియర్ నాయకులు డాక్టర్ అంకూరి నాగార్జున నేతృత్వంలో పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బహుజనులంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరారు.



