అక్షరాస్యతతోనే సాధికారత సాధ్యం: సర్పంచ్

అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ULLAS కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో వయోజన విద్యా పరీక్ష నిర్వహించారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో గతకొన్ని రోజులుగా వృద్ధులు, నిరక్షరాస్యులకు అక్షరాలు, లెక్కలు, సంతకం చేయడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని సర్పంచ్ ఎర్రల జానకిరాజు, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ సందర్శించి అభ్యర్థులను అభినందించారు.





