← Back to news

రాత్రంతా కరెంట్ కట్.. లైన్‌మెన్ దావత్‌లో

By Kamal Kumar· 14h ago· Ekmai, Basheerabad, Vikarabad

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మాయ్ గ్రామంలోని 10వ వార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్డ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్డు మొత్తం చీకట్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. రాత్రంతా కరెంట్ లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సమస్యను లైన్‌మెన్ తిప్పన్నకు ఫోన్‌లో వివరించగా, తాను వేరే ఊరిలో దావత్‌కు వచ్చానని సమాధానం చెప్పినట్లు గ్రామస్తులు ఫైరవుతున్నారు.

More in Local