← Back to news

భీంగల్‌లో భగత్ సింగ్ జయంతి

By Ashok· 2h ago· నిజామాబాద్
భీంగల్‌లో భగత్ సింగ్ జయంతి

నిజామాబాద్ జిల్లా భీంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో NSUI డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ, చిన్న ఏజ్‌లోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్ఫూర్తితో స్టూడెంట్స్, యంగ్ జనరేషన్ మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. చదువు, స్పోర్ట్స్ లో ముందుండాలని చెప్పారు.

More in Local