← Back to news

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి: కలెక్టర్

By DK· 1d ago
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి: కలెక్టర్

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని శివకుమార్ నిర్వహిస్తున్న మట్టి గణపతి విగ్రహాల స్టాల్‌ను కలెక్టర్ సందర్శించారు. చెరువు మట్టితో సహజంగా తయారు చేసిన విగ్రహాల తయారీ విధానం, ప్రత్యేకతలను పరిశీలించి మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గత 12 ఏళ్లుగా విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు శివకుమార్ వివరించారు.

More in Local