99% ST పంచాయతీలకు గెజిట్ నోటిఫికేషన్..!

అల్లూరి జిల్లాలో 99 శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలకు కలెక్టర్ టి. నిషాంతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 244 సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ మహిళలకు 117, ఎస్టీ జనరల్‌కు 124, అన్‌రిజర్వుడ్‌కు 3 కేటాయించారు. అన్‌రిజర్వుడ్ స్థానాలైన భీంపోలు, గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీలు అనంతగిరి మండలంలో ఉన్నాయి. 2,446 వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీ మహిళలకు 1,086, ఎస్టీ జనరల్‌కు 1,162, అన్‌రిజర్వుడ్‌కు 198 స్థానాలు కేటాయించారు.



