← Back to news

రెయిన్ ఎఫెక్ట్.. దెబ్బతిన్న 'చార్మినార్'

By Krishna· 6h ago

TG: సెప్టెంబర్ 22న కురిసిన వర్షానికి చార్మినార్‌ డ్యామేజ్ అయ్యింది. లాడ్‌బజార్ వైపు.. వైట్ సిమెంట్ ప్లాస్టర్ స్వల్పంగా ఊడిపడింది. సెక్యూరిటీ టీమ్ వెంటనే శిథిలాల్ని తొలగించి ప్రభావిత ప్రాంతాన్ని మూసివేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. దాదాపు 430 ఏళ్ల ఈ కట్టడం నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బయటి గోడ భాగంలో ఇలా జరిగిందనీ, రిపేర్లకు టెండర్ ప్రక్రియ జరుగుతోందని ASI అధికారులు తెలిపారు. ఇదివరకు కూడా ఇలాంటి చిన్న సంఘటనలు జరిగాయి.

More in TG