కర్నూలు జీవీ మాల్లో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా పార్క్ రోడ్డులో ఉన్న GV మాల్లో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దోమలు ఎక్కువగా ఉన్నాయని.. అవి పోవడానికి పోగ పెట్టారు. అయితే అక్కడ ఉన్న బ్యానర్లు అంటుకొని మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంతో మాల్లో ఉన్న బట్టలు దహనమయ్యాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు



