ప్రకాశం జిల్లాలో రచ్చ రచ్చ
AP: ఆంధ్రప్రదేశ్.. ప్రకాశం జిల్లా.. దర్శిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు YCP అభ్యర్థులతోపాటూ.. నేతలు, క్యాడర్ కూడా తరలివచ్చారు. ఐతే.. నామినేషన్ వేసే వారితో నలుగురు మాత్రమే వెళ్లాలంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో గొడవ మొదలైంది. ఎస్సై ఏడుకొండలకు గాయాలయ్యాయి. క్యాడర్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా YCP నాయకులు రోడ్డుపై ధర్నా చేశారు.

