మంత్రికే 'కుల వివక్ష'.. ఇలాగైతే ఎలా?
ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ మంత్రి రేఖా ఆర్య.. తన భర్త సాహూ.. తనపై కుల వివక్షకు పాల్పడ్డారని ఆరోపించారు. డెహ్రాడూన్లోని కంటోన్మెంట్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తనపై శారీరక దాడి చేశారనీ, కులం పేరుతో తిడుతున్నారనీ, తనను చంపేందుకు కుట్ర పన్నారన్న ఆమె.. మోసం, ఫోర్జరీ ఆరోపణలు కూడా చేశారు. తనకూ, పిల్లలకూ ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆడియో రికార్డింగ్ను ఆధారంగా చూపించారు. మరోవైపు, ఈ ఆరోపణలను సాహూ ఖండించారు.



