"భారత్ తాలిబన్లు RSS": యాక్టర్ కిషోర్
మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయనీ, బాధితులపైనే పోలీసులు దాడులు చేస్తున్నారనీ నటుడు కిషోర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఏటా 32 వేల మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న ఆయన.. హత్రాస్, అంకితా భండారి, బిల్కిస్ బానో కేసులను ప్రస్తావించారు. RSSను ‘భారత్లో తాలిబన్లుగా పోల్చిన ఆయన.. మనుస్మృతి ఆలోచనలతో మహిళలను నియంత్రించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మోదీ, RSS అండతో గుండాలు పుట్టుకొస్తున్నారని మండిపడ్డారు.



