సుబ్లేడ్‌లో గణేష్ ఉత్సవాలు.. అన్నదాన కార్యక్రమం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలోని ఎమ్మార్పీఎస్ గద్దె సెంటర్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆది జాంబవ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో సంగ బత్తుల స్వాతి సుమన్ రెడ్డి, వార్డు మెంబర్ చారీ వినయ్, పోలేపొంగు శ్రీకాంత్, పానుగంటి పరుశురాములు, కాళ్ల లింగయ్య, పోలేపొంగు వీరాస్వామి, గంట సైదులు, తదితరులు హాజరయ్యారు.


