తుక్కుగూడలో నర్సు హత్య.. నిందితుడు అరెస్ట్

TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నర్సు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, ఆస్పత్రి సమీపంలోని క్వార్టర్స్‌లో నివసిస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన బిహార్‌కు చెందిన మహ్మద్ సనావుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.



