బీజేపీ వాళ్లు మమ్మల్ని విమర్శించడం విడ్డూరం: పవన్ ఖేరా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్‌పై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా రియాక్ట్ అయ్యారు. బీజేపీకి మెజారిటీ రావడానికి 50-60 ఏళ్లు పట్టిందని, తమ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో లేకపోవడాన్ని వాళ్లు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. 2029లో కూడా తామే గెలుస్తామని బీజేపీ అంత నమ్మకంగా ఎలా చెబుతోందని ప్రశ్నించారు. దీని వెనుక CEC జ్ఞానేశ్ కుమార్ ఉన్నారా అని సందేహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 13 కోట్ల మంది పేర్లు ఎలా తొలగించారని ప్రశ్నించారు.


