పబ్లిక్ గార్డెన్స్‌లో కరెన్సీ ప్రదర్శన

TG: హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పాత నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన జరగనుంది. ఇందులో అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ స్టాంపులు, పాత నోట్లను చూడవచ్చు. ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 8500212306 నంబర్‌ను సంప్రదించవచ్చు.



