మక్తల్‌లో ఘనంగా తోడు గణపతుల ఊరేగింపు

వినాయక చవితి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వీఎచ్‌పీ, బజరంగ్ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి విశ్వకర్మ ఇంటి వరకు భజనలతో శోభాయాత్ర కొనసాగింది. అక్కడ తోడు గణపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయా మండపాలకు ఊరేగింపుగా విగ్రహాలను తరలించారు. అనంతరం మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.