కెనడాలో ఇండియన్ విమెన్ అరెస్ట్.. వీడియో వైరల్
కెనడాలోని కాల్‌గరీలో ట్రాఫిక్ గొడవ ఒక ఇండియన్ విమెన్ అరెస్టుకు దారితీసింది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి కారు దారి ఇవ్వకపోవడంతో అతడు తన ఫోన్‌లో వీడియో తీశాడు. దీంతో కారు నుంచి దిగిన ఆమె అతడితో గొడవ చేసింది. వీడియో తీయొద్దంటూ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు, అతడి బ్యాగ్‌ను పట్టుకుని రోడ్డుపైకి లాగింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను అరెస్టు చేశారు. ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



