ఫ్రాన్స్‌లో ఉద్రిక్తత.. 350 మందికిపైగా నిరసనకారుల అరెస్ట్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈ వీకెండ్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఒక్క పారిస్‌లోనే సుమారు 350 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనలు హింసకు దారితీశాయి. సుమారు 5 లక్షల మందికి పైగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు.



