కరెంట్ కోతలపై రైతుల ఫైర్.. రోడ్డుపై నిరసన

కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు రోడ్డెక్కారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఈరోజు ఉదయం రామాయంపేట-గజ్వేల్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. పొలాలకు కరెంట్ అందక వరి పంటను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెలలో పంట కోతకు వస్తుందని, అప్పటివరకు కరెంట్ను రోజుకు 12 గంటలు అందించాలని డిమాండ్ చేశారు. వోల్టేజ్ సమస్యలతో బోర్వెల్ మోటార్లు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు.



