శాతవాహన యూనివర్సిటీలో మంత్రి ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీని బుధవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డైరెక్ట్‌గా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలపై అక్కడే ఉన్న అధికారులతో చర్చించి, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.


