చెరువు ఆయకట్టును పరిశీలించిన కలెక్టర్

ఆమని చెరువు ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అగిరిపల్లి మండలం సగ్గూరులోని ఆమని చెరువు ఆయకట్టు ప్రాంతాన్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువు నీటిని తమ పొలాలకు సాగునీటిగా వినియోగించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని రైతులు కలెక్టర్‌కు వివరించారు.


