నీళ్లడిగితే విద్యార్థినులను కొడతారా?

TG: ములుగు జిల్లా.. గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము బట్టలు ఉతికే నీళ్లు తాగుతున్నామనీ.. తాగేందుకు మంచి నీళ్లు ఎందుకు ప్రొవైడ్ చెయ్యట్లేదు అని అడిగితే.. ప్రిన్సిపల్ తమను కొట్టారని వారు ఆరోపించారు. మౌలిక వసతులు లేక నిత్య నరకం చూస్తున్నామని వారు ఆరోపించారు. తమ సమస్యలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. కనీస వసతులే లేకపోతే, ఇక చదువులెలా సాగుతాయనే ప్రశ్నలొస్తున్నాయి.



