← Back to news

షాద్‌నగర్‌లో భారీ గణేష్ విగ్రహం ఆగమనం

By A Srisailam· 2d ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
షాద్‌నగర్‌లో భారీ గణేష్ విగ్రహం ఆగమనం

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏకదంత్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో భారీ గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ప్రతిష్ఠించారు. భారీ విగ్రహం స్థానికులను ఆకట్టుకుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించిన విగ్రహంలో కళాత్మకత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గణేష్ ఆగమన వేడుకల్లో ఏకదంత్ యూత్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉత్సవాలను నిర్వహించారు.

More in Local