నదిలో దూకిన వ్యక్తికి రక్షణ: కాపాడిన వారికి సన్మానం

కృష్ణానది వేగంగా ప్రవహిస్తుండగా నదిలోకి దూకిన వ్యక్తిని కాపాడిన తాడేపల్లి ట్రాఫిక్ SI నారాయణ, మత్స్యకారులు మల్లి, గోపిలను జె.వి సేవాదళ్ సత్కరించింది. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో సేవాదళ్ ఫౌండర్ జొన్న వెంకటేష్ వారిని శాలువాతో సత్కరించి, మత్స్యకారులకు క్యాష్ ప్రైజ్ అందించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీరి సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు.



