తిమ్మాపూర్‌లో వయోజన విద్య పరీక్షలు

నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్‌లో కేంద్ర ప్రభుత్వ 'ఉల్లాస్' పథకం కింద ఇవాళ అక్షరాస్యతా పరీక్షలు నిర్వహించారు. గ్రామాన్ని పూర్తిగా చదువుకున్న ఊరుగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఎగ్జామ్‌కు దాదాపు 100 మంది నిరక్షరాస్యులు వచ్చారు. సర్పంచ్ పుప్పాల నరేష్ వచ్చి ఎగ్జామ్ సెంటర్‌ను పరిశీలించారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే తపన చూపిన వారిని అభినందించిన సర్పంచ్, చదువుతోనే సమాజంలో రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయని చెప్పారు.



