← Back to news

'సదువుల బతుకమ్మ' వేడుక

By Krishna· 8h ago
'సదువుల బతుకమ్మ' వేడుక

తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్.. సరికొత్తగా "సదువుల బతుకమ్మ" వేడుకను నిర్వహించబోతోంది. అక్టోబర్ 15, సాయంత్రం 4గంటల 30 నిమిషాల నుంచి 6గంటల 30 నిమిషాల వరకూ ఈ ప్రోగ్రామ్.. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్.. లలిత కళా తోరణంలో జరగనుంది. TPFతోపాటూ, GUTS, తల్లుల సంఘం, DBF అధ్వర్యంలో ఇది జరగనుంది. ఇందులో బతుకమ్మ పండుగ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, అదే సమయంలో చదువుల ప్రాముఖ్యాన్ని కూడా వివరించనున్నారు. పిల్లలు, పెద్దలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

More in TG