← Back to news

భూముల పేరుతో బురద రాజకీయాలు: పొంగులేటి

By DK· 2d ago· హైదరాబాద్
భూముల పేరుతో బురద రాజకీయాలు: పొంగులేటి

TG: 22ఏ భూములపై ప్రతిపక్షాల ఆరోపణలు బురదచల్లే ప్రయత్నమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిషేధిత భూముల జాబితాలో సమస్యలను పరిష్కరించిన తర్వాత కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమగ్ర భూసర్వేతో ఆబాదీ, పట్టా, ప్రభుత్వ భూముల సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న జాబితానే అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారన్నారు.

More in TG