పేరపళ్లలో చెరువు పనులకు శ్రీకారం

నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో జయమ్మ చెరువు పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జి. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. చెరువు పనులు పూర్తయితే రైతులకు సాగునీటి వసతి మెరుగుపడి వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, CITU జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.



