'సామాజిక న్యాయమే మా పోరాటం'

ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (AIAYS) 50వ స్వర్ణోత్సవ వేడుకలు నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. జాతీయ కోఆర్డినేటర్ వరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు మూలనివాసి మాలజీ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆర్థిక సమానత్వం, విద్య, వైద్యం హక్కుల కోసం ఉద్యమించాలని సూచించారు. పూలే, అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. పలు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.




