పోషణ సంబరం.. ఐలాపూర్ లో సందడి!

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్‌లో పోషణ పక్షం సందడి! ICDS అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా పోషణ సంబరాలు జరిగాయి. ప్రెగ్నెంట్ అమ్మలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. సూపర్‌వైజర్ రేఖ మాట్లాడుతూ.. సమతుల్య పౌష్టికాహారమే హెల్తీ జనరేషన్‌కు కీ అన్నారు. పిల్లల ఎత్తు, బరువు రెగ్యులర్‌గా చెక్ చేయాలని సూచించారు. సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ గాదె శ్రీనివాస్, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.




