← Back to news

ప్రకృతిని పరిచయం చేసే లైబ్రరీ!

By A.Ajay· 9 Oct 2026
ప్రకృతిని పరిచయం చేసే లైబ్రరీ!

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం థార్న్టన్‌లో ప్రకృతిని దగ్గరగా తెలుసుకునేందుకు ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ‘అనీథింక్ నేచర్ లైబ్రరీ’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ లైబ్రరీలో పుస్తకాలతో పాటు ప్రకృతిని తెలుసుకునేందుకు ఉపయోగపడే వస్తువులను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. పక్షులను చూడటానికి బైనాక్యులర్లు, మొక్కలను పెంచేందుకు అవసరమైన వస్తువులు, చిన్న జీవులను దగ్గరగా చూడటానికి ఉపయోగించే పరికరాలు, అడవి జంతువులను గమనించే కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, పెద్దల్లో ప్రకృతిపై ఆసక్తి పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.

More in International