తుక్కుగూడలో నర్సు హత్య..! కఠిన శిక్షకు SFI డిమాండ్

హైదరాబాద్‌లో 21 ఏళ్ల ఆదివాసీ యువతి, నర్సు దారుణ హత్యకు గురయ్యారు.<br>ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డివిజన్‌లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వడ్ల, శ్రీకాంత్ మాట్లాడుతూ కేసును వేగంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. Prime కేర్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు.



