← Back to news

గాయంతో భీమవరంలో వరుణ్ తేజ్ జోరు!

By BK· 6 Aug 2026
గాయంతో భీమవరంలో వరుణ్ తేజ్ జోరు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్లలో స్పీడు పెంచారు. వరుణ్ కాలికైన గాయం ఇంకా తగ్గకపోయినా, భీమవరంలోని ఒక కాలేజీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కి వచ్చి సందడి చేశారు. 2018లో ‘తొలిప్రేమ’ ఈవెంట్ ఇక్కడే జరిగిందని, అప్పటి మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, రితీకా నాయక్ హీరోయిన్‌గా, థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలోకి వస్తోంది.

More in Cinema