మెగా DSCపై మళ్లీ YS జగన్ ఫైర్!

AP: మెగా DSC స్కామ్‌పై YS జగన్ మరోసారి రియాక్ట్ అయ్యారు. ఏడు దశల వెరిఫికేషన్ పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో షాకింగ్ విషయం బయటపడుతోందన్నారు. 'వెరిఫికేషన్ నో,.. నో ఏడు దశల వెరిఫికేషన్' అంటూ జగన్ <a href="https://x.com/ysjagan/status/2098647956748419280">‘X’లో పోస్ట్</a> చేశారు. విజేతల లిస్ట్ చెక్ చేస్తే, క్యాండిడేట్ల పేర్లు కనిపించలేదనీ, ఖోఖో అధికారులను కాంటాక్ట్ అవ్వగా, సర్టిఫికెట్ నకిలీదని తేలిందన్నారు. నాగార్జున వర్సిటీని అడిగితే ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని చెప్పారని జగన్ తెలిపారు.



