ఉత్తరాలు తగ్గినా.. ప్రజలకు చేరువగా పోస్ట్‌మాన్

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి పోస్టాఫీసులో పోస్ట్‌మాన్‌గా పనిచేస్తున్న లాయఖ్ అలీ కాలానికి అనుగుణంగా తన సేవలను విస్తరిస్తున్నారు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత ఉత్తరాల సంఖ్య తగ్గినా ప్రభుత్వ నోటీసులను ప్రజలకు చేరవేస్తున్నారు. వృద్ధులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ, పోస్టల్ ఇన్సూరెన్స్, పొదుపు పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. మైక్రో ఏటీఎం మిషిన్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు.

