ఆష్ఠ గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ఠ గ్రామంలో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన రహదారులపై కోలాటాలు ఆడుతూ, బస్టాండ్ సమీపంలో బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకొని కోలాటం ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా గ్రామ మహిళలతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

