నిద్రపోయే ముందు ఇవి అస్సలు మర్చిపోకండి!

మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన నిద్ర కావాలంటే రాత్రి పడుకోవడానికి ఒక అర గంట ముందే ఫోన్ పక్కన పెట్టాలని, అప్పుడే మంచి నిద్ర పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తర్వాత కొన్ని నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. లైట్‌గా స్ట్రెచింగ్ చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది. రేపు పొద్దున్నే వేసుకునే బట్టలు, చేయాల్సిన పనులను ఇప్పటి నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే టెన్షన్ ఉండదు. చివరిగా 7 నుండి 8 గంటలు హాయిగా నిద్రపోతే, మరుసటి రోజు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు.



